»Komatireddy Rajagopal Reddy Said We Will Close Belt Shops In Munugode Constituency
Komatireddy Rajagopal Reddy: నా నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ చేస్తాం
మునుగోడు నియోజవర్గంలో అనధికారంగా మద్యం విక్రయాలు చేస్తున్న బెల్ట్ షాపులను రద్దు చేస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.
komatireddy Rajagopal Reddy said We will close belt shops in munugode constituency
మునుగోడు నియోజకవర్గంలో ఒక్క బెల్ట్ షాపు(belt shops) కూడా లేకుండా చేస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(komatireddy Rajagopal Reddy) పేర్కొన్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెల్చిన తర్వాత మొదటిసారి మునుగోడు నియోజకవర్గ(munugode constituency) కేంద్రానికి వచ్చిన క్రమంలో వెల్లడించారు. ఆ నేపథ్యంలో మునుగోడులోని బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. ఆ తర్వాత మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి ఈ గెలుపు తనది కాదని..అందుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తది అని అన్నారు. తనకు 40 వేల మెజారిటీ వచ్చిన నేపథ్యంలో దానికి కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఎంతో ఉందని అన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజల కోరిక మేరకు బెల్ట్ షాపులు లేకుండా చేస్తామన్నారు. అందుకోసం తన పదవీ పోయినా పర్వాలేదన్నారు. దీంతోపాటు కిస్తరాంపల్లి చర్లగూడెం ప్రాజెక్టులను పూర్తి చేయిస్తామని చెప్పారు.
అవినీతి నియంత కుటుంబ పాలన కొనసాగించిన కేసీఆర్(KCR) ప్రభుత్వ పతనం మొదలైందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతోనే రాష్ట్రానికి నిజమైన స్వాతంత్రం, ఆత్మగౌరవం వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలోని అనేక జిల్లాల్లోని ప్రతిగ్రామంలో లైసెన్సు దుకాణాల నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామాల్లో ప్రీమియం ధరకు ఎక్కువగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్టుషాపు యజమానుల నుంచి రూ.40 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. లైసెన్సు కోసం చేసిన ఖర్చుకు మించి డబ్బులు రాకపోవడంతో మద్యం షాపు యజమానులు బెల్టు షాపుల యజమానులకు మద్యం విక్రయించే పనిలో పడ్డారని గతంలో వెలుగులోకి వచ్చింది.