EPFO: కొవిడ్(Covid) తీవ్రంగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన కొవిడ్ అడ్వాన్స్ (Covid advance)ను ఉద్యోగుల భవిష్య నిధి నిలిపివేసినట్లు ప్రకటించింది. కరోనా(Corona) ఉదృతంగా ఉన్నప్పుడు ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు కోసం ఈపీఎఫ్ఓ(EPFO) ఈ సదుపాయాన్ని కల్పించింది. హెల్త్ ఎమర్జెన్సీ జాబితా నుంచి కొవిడ్-19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొవిడ్ అడ్వాన్స్‌ను నిలిపివేస్తూ ఈపీఎఫ్ఓ తాజా నిర్ణయం తీసుకుంది. వారం క్రితం ఉద్యోగులతో మీటింగ్ నిర్వహించింది. ప్రస్తుతం కొవిడ్ ప్రభావం తగ్గిందని ఇకపై ఈ అవకాశం కల్పిస్తే దాన్ని మిస్యూజ్ చేస్తారని ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది.
నిలిపివేతకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలేనే విడుదల చేస్తామని తెలిపింది. కొవిడ్ కాలంలో తీసుకొచ్చిన ఈ నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ సదుపాయం చాలా మందికి వినియోగించుకున్నారు. కొంతమంది మాత్రం వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు. దీన్ని ఇలానే కొనసాగిస్తే రిటైర్మెంట్ సేవింగ్స్‌పై ప్రభావం పడిందని, అందుకే ఈ సదుపాయాన్ని బంద్ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 2020 మార్చి 28న తీసుకొచ్చిన కొవిడ్ అడ్వాన్స్ స్కీమ్‌తో 2.2 కోట్ల మందికి ఉపయోగపడింది. దాదాపు రూ.48 వేల కోట్లు కొవిడ్ అడ్వాన్స్‌ను వినియోగించుకున్నట్లు తాజా వార్షిక నివేదిక ద్వారా వెల్లడైంది.