»Coronavirus New Cases Of Covid In The Country The Frightening Variant Is Jn 1
Coronavirus: దేశంలో కొత్తగా కోవిడ్ కేసులు..భయపెడుతున్న వేరియంట్ జేఎన్.1
ప్రస్తుతం కోవిడ్ వేరియంట్ జేఎన్.1 ప్రజలను వణికిస్తోంది. రోజురోజుకి దేశంలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ వేరియంట్ జేఎన్.1 తొందరగా వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Coronavirus: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం కోవిడ్ వేరియంట్ జేఎన్.1 ప్రజలను వణికిస్తోంది. దేశంలో తాజాగా 63 కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కూడా ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. దేశంలో మొత్తం 63 కేసులు నమోదు కాగా.. అందులో గోవాలో అత్యధికంగా 34 నమోదయ్యాయి. మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ప్రస్తుతం భారీగా పెరిగింది.
A total of 63 JN.1 COVID variant cases have been reported in the country till 24th December. 34 cases from Goa, 9 from Maharashtra, 8 from Karnataka, 6 from Kerala, 4 from Tamil Nadu and 2 from Telangana: Sources
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 628 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 4054 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క కేరళలోనే 128 యాక్టివ్ కేసులు నమోదు కాగా.. కర్ణాటకలో 73, మహారాష్ట్రలో 50, రాజస్థాన్లో 11, తమిళనాడులో 9, తెలంగాణలో 8 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. అదే సమయంలో వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది.