»700 Employees Of Airbus Falls Ill After Attended Christmas Party In France
Christmas Party: విషాదంగా మారిన క్రిస్మస్ పార్టీ … 700 మందికి అస్వస్థత
క్రిస్మస్ దగ్గర పడింది. ప్రపంచ వ్యాప్తంగా వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందు కలకలం రేపింది.
Christmas Party: క్రిస్మస్ దగ్గర పడింది. ప్రపంచ వ్యాప్తంగా వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందు కలకలం రేపింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మంది అస్వస్థతకు గురయ్యారు. మీడియా నివేదికల ప్రకారం, పశ్చిమ ఫ్రాన్స్‌లోని మోంటోయిర్ డి బ్రిటన్‌లో ఎయిర్‌బస్ అట్లాంటిక్ ఉద్యోగుల కోసం క్రిస్మస్ పార్టీ ఏర్పాటు చేయబడింది. కంపెనీ ఆవరణలోని ఓ రెస్టారెంట్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో దాదాపు 2,600 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వారికి నోరూరించే రకరకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఎండ్రకాయలు, ఆల్చిప్పలు, గొడ్డు మాంసం, ఇతర వంటకాలను అతిథులకు వడ్డించారు. అయితే విందు ముగిసిన తర్వాత దాదాపు 700 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో కొందరు ఉద్యోగులకు వాంతులు చేసుకోవడంతోపాటు పలు సమస్యలు వచ్చాయి. వీరిలో చాలా మంది ఉద్యోగులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఫ్రెంచ్ హెల్త్ ఏజెన్సీ (ARS) ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే ఉద్యోగులకు మెరుగైన వైద్య ఏర్పాట్లు చేశారు. భోజనంలో నాణ్యత లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమిక విచారణలో తేలింది. క్రిస్మస్ పార్టీ డిన్నర్లో ఎలాంటి ఆహారం అందించారనే దానిపై విచారణ జరుగుతోందని ఫ్రెంచ్ ఆరోగ్య సంస్థ వర్గాలు తెలిపాయి. నాణ్యత రాజీపడిందా? లేదా? మరేదైనా సమస్య ఉందా? ఈ కోణంలో కూడా విచారణ ప్రారంభించారు. పుడ్ నమూనా పరీక్ష కోసం పంపబడింది. ఎయిర్‌బస్ అట్లాంటిక్ అనేది ఎయిర్‌బస్ కంపెనీకి అనుబంధ సంస్థ. ఇది ఐదు దేశాలలో కనీసం 15,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల తయారీ సంస్థ. దీనికి ఫ్రాన్స్‌లో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. కాగా, క్రిస్మస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర పశ్చిమ దేశాలతో పాటు భారత్‌లోనూ క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి.