»Coronavirus Two Died Corona Positive In Medical Tests
Coronavirus: ఇద్దరు మృతి.. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్
దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల తెలంగాణలో ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు. వాళ్లకి వైద్య పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ అని తేలింది.
Coronavirus: ప్రస్తుతం కరోనా చాపకింద నీరులా ప్రవహిస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్ 1 తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతోంది. రోజురోజుకి కోవిడ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. ఈక్రమంలో తెలంగాణలో దాదాపు ఏడాదిన్నర తర్వాత తొలి కరోనా మరణం నమోదైంది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న రోగి ఇటీవల హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చేరాడు. సమస్య తీవ్రం కావడం వల్ల రోగి మృతి చెందారని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. అయితే రోగికి చేసిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు.
అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన మరో వ్యక్తి కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఇదే ఆసుపత్రిలో మరో ముగ్గురు కోవిడ్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 55, ఆంధ్రప్రదేశ్లో 29 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం.