Hyderabad: పాతకక్షల కారణంగా హైదరాబాద్‌లో ఓ యువకుడు బలి అయ్యాడు. ఎస్ఆర్ నగర్‌లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ అలియాస్ సిద్ధూ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. గతేడాది స్థానికంగా జరిగిన ఓ హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో జైలుకు వెళ్లిన సిద్ధూ రెండు నెలల క్రితం విడుదలయ్యాడు. ప్రస్తుతం ప్ర్రగతినగర్లో తన తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. నిన్న రాత్రి సిద్ధూ తల్లి ఊరు వెళ్లింది. దీంతో సిద్ధూ తన మిత్రులైన మహేశ్, శివప్ప, సమీర్‌తో కలిసి మద్యం తాగాడు.
దారుణం.. హత్య చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువకులు
హైదరాబాద్ – బాచుపల్లి పీఏస్ పరిధిలో సిద్దు అనే యువకుడిని ఇద్దరు యువకులు వెంటాడి 12 సార్లు కత్తులతో పొడిచి, తలపై బండరాళ్లతో మోదీ దారుణంగా చంపారు.
చివరికి ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ప్రగతినగర్‌లోని బతుకమ్మ షూట్ ఎదురుగా నిలబడి ఉన్నాడు. అయితే గతంలో హత్యకు గురైన తరుణ్ స్నేహితులు సుమారుగా 20 మంది ద్విచక్రవాహనాలపై వచ్చి సిద్ధూను కత్తులతో పొడిచి చంపారు. సిద్ధూ కేకలు వేస్తున్న పట్టించుకోకుండా శరీరంపై 11 కత్తిపోట్లతో పొడిచారు. సిద్ధూ కింద పడిపోవడంతో అతనిపై బండరాయితో తలపై మోపి హత్య చేశారు. ఆ తర్వాత మర్డర్ చేశామని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆరీల్లో ధగడ్ బోల్ రే.. సిద్ధూ బోల్ రే అని క్యాప్షన్ ఇచ్చి సాంగ్ క్రియేట్ చేసి పెట్టారు.
పొడిచిన వాళ్లు కత్తి, రక్తంతో ఉన్న చేతులు, వెళ్లే వాళ్లకి ఆ కత్తిని చూపించడం, డ్యాన్స్‌లు వేస్తూ.. వీడియో అప్లోడ్ చేశారు. దీంతో వీడియో వైరల్ కావడంతో చూసిన వాళ్లు మండిపడ్డారు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన చేసిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.