»Engine Cover Blown While The Plane Was In The Air Shocking Video
Viral Video: విమానం గాల్లో ఉండగా ఊడిన ఇంజిన్ కవర్.. వీడియో వైరల్
విమానం టేకాఫ్ అవగానే ఇంజిన్ కవర్ ఒక్కసారిగా ఊడిపోయింది. అది గాలికి కొట్టుకుంటు ఊడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.
Engine cover blown while the plane was in the air.. Shocking video
Viral Video: రన్‌వై పై ఓ విమానం టేకాఫ్‌కు సిద్ధం అయింది. అదే సమయంలో ఇంజిన్ కవర్(Engine Cover) ఊడిపోయింది. అది గమనించని సిబ్బంది ఫ్లైట్‌ను టేకాఫ్ చేశారు. కాసేపటికే ఇంజిన్ కవర్ పూర్తిగా ఊడిపోయింది. గమనించిన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి (Emergency Landing) వచ్చింది. అమెరికాలో ఓ బోయింగ్ విమానానికి (Boeing plane) సంబంధించిన ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఆ సంస్థ స్పందించింది. విమానం సురక్షితంగా ఎయిర్‌పోర్టులో దిగినట్లు వెల్లడించింది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు సంస్థ చెందిన బోయింగ్ 737-800 (Boeing 737-800) విమానం ఆదివారం ఉదయం డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం (Denver International Airport) నుంచి హాస్టన్కు వెళ్తుంది. డెన్వర్‌లో టేకాఫ్ అయిన పదినిమిషాలకే విమానం ఇంజిన్ కవర్ (Engine Cover) ఊడసాగింది. పూర్తిగా టేకాఫ్ అవగానే కవర్ మొత్తం ఊడింది. కొంత భాగం రెక్కలకు తాకుతుంది. ఇది గమనించిన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాలేదు. ఆ సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ దర్యాప్తునకు ఆదేశించింది.