»United Airlines While The Plane Was In The Air The Tire Fell Down On A Car Video Viral
viral video: విమానం గాల్లో ఉండగానే టైర్ ఊడి కింద కారుపై పడింది.
విమానం గాల్లో ఉండగానే టైర్ ఊడి కింద పడింది. వేగంగా కిందకు వచ్చిన టైర్ పార్కింగ్ కారుపై పడింది. కారు ధ్వంసం అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
United Airlines While the plane was in the air, the tire fell down on a car video viral
viral video: గాల్లో ఉన్న ఓ విమానం టైర్ ఊడి కిందపడింది. విషయం తెలుసుకున్న పైలెట్ ఫ్లైట్‌ను సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అమెరికాలోని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ (United Airlines)కు విమానానికి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పైలట్లు అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయకపోయి ఉంటే ఘోరం జరిగుండేదని మీడియా కథనాలు వెలువడ్డాయి.
శాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777-200 విమానం జపాన్‌లోని ఒసాకాకు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే వెనుక వైపున ల్యాండింగ్ గేర్‌లోని ఓ టైరు ఊడిపడింది. విమానాశ్రయంలోని పార్కింగ్ లాట్లో ఉన్న కారుపై బలంగా పడింది. ఈ ఘటనలో కారు తీవ్రంగా ధ్వంసమైంది. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న పైలెట్లు వెంటనే విమానాన్ని దారిమళ్లించి లాస్ఏంజిల్స్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించేశారు. ఆ సమయంలో ఫ్లైట్‌లో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బోయింగ్ 777 విమానాల్లో రెండు ల్యాండింగ్ గేర్లకు ఆరు టైర్లు ఉంటాయి. చక్రాలు ఊడినా, డ్యామేజ్ అయినా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఈ మోడల్‌ను డిజైన్ చేశారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.