MLG: మేడారంలో సోమవారం సాయంత్రం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. జాతరలో మొదటి విడతగా జంపన్నవాగు ఇరువైపులా 10 వేల మంది భక్తులకు షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తాగునీరు, రోడ్ల ఏర్పాటు పకడ్బందీగా చేస్తున్నామని, గతంలో నిధులు వృథాగా కొట్టుకుపోయాయని ఆయన అన్నారు. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌తో జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని చెప్పారు.