RR: ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు జారి పడటంతో బాలుడు మృతి చెందిన ఘటన గచ్చిబౌలి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. నేపాల్‌కు చెందిన కుటుంబం మసీద్ బండలో నివాసముంటున్నారు. సోమవారం సూరజ్ రోత్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడగా.. బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.