RR: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 60 మంది సోమవారం రాత్రి ఉమ్రా యాత్రకు బయలుదేరి వెళ్లారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉమ్రా యాత్రికులు తరలిరావడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో సందడి నెలకొంది. యాత్రికుల కుటుం బసభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు వారి యాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలతో సత్కరించారు.