RR: ఆమనగల్లు మున్సిపాలిటీలోని 11వ వార్డ్ ఆదర్శనగర్, పద్మశాలి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్‌కు ఆయా కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. 2 కాలనీలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి మాత్రం నోచుకోలేక పోయాయన్నారు. కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందన్నారు.