RR: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీపురం కాలనీలో వినియోగంలో ఉన్న చత్రపతి శివాజీ పార్కును అక్రమంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఆ రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దుచేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.