మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఈరోజు శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. శ్రీలంకలోని కొలంబో వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మెగాటోర్నీలో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించని శ్రీలంక జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో కూడా ఓటమి పాలైతే, శ్రీలంక దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.