భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో ఇరుజట్ల బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్లో మొత్తం 1280 పరుగులు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. భారత్ తరఫున యశస్వీ జైస్వాల్ (175), శుభ్మన్ గిల్ (129) శతకాలు బాదగా, వెస్టిండీస్ తరఫున జాన్ కాంప్బెల్ (115), షాయ్ హోప్ (103) సెంచరీలు చేశారు.