హర్షిత్ రాణాకు అన్ని ఫార్మాట్లలో అవకాశం దక్కడంపై SMలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. కొందరు మాజీ క్రికెటర్లు కూడా రాణాను ‘కోచ్ తాలుకా ప్లేయర్’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా కోచ్ గంభీర్ స్పందించాడు. తనను టార్గెట్ చేయాలనుకుంటే నేరుగా తనపై విమర్శలు చేయాలన్నాడు. యువ క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించాడు.