KMR: శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకును కూల్చివేయాలని నసురుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామస్తులు మంగళవారం కార్యదర్శి సౌందర్యకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు హన్మండ్లు మాట్లాడుతూ.. 30 సంవత్సరాల క్రితం నిర్మించిన మంచినీటి వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరిందని పేర్కొన్నారు.