AP: తిరుమల శ్రీవారి పరకామణి కేసుతో సంబంధం ఉన్నవారిని పాతాళంలో ఉన్నా తీసుకొస్తామని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. నిందితుడు రవికుమార్ ఆస్తులను ఎవరెవరు పంచుకున్నారో తేలుస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగా పరకామణి చోరీ దొంగలను కాపాడిందని ఆరోపించారు. ఈ కేసులో తెర వెనుక ఉన్నవారికి శిక్షపడేలా చేస్తామని తెలిపారు.