WGL: మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో సట్టా స్థావరంపై సోమవారం దాడి చేసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం తెలిపారు. శాంతినగర్ సాకరాసికుంటకు చెందిన రాజు సట్టా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించి, రూ.6,450 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నగదుతో పాటు సట్టా స్లిప్పులు స్వాధీనం చేసుకొని మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించామన్నారు.