VKB: బంట్వారం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న స్వీపర్, అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి వెంకటేశ్వర రావు తెలిపారు. స్థానిక మండల మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని, 7వ తరగతి ఉత్తీర్ణులై 18 – 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.