RR: షాద్ నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండలంలో సీపీఐ మండల సమితి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య పాల్గొని మాట్లాడుతూ.. గృహలక్ష్మి పథకం ఎప్పుడు అమలు పరుస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ అమలు పరుస్తున్న పథకాలలో మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు.