JGL: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 332.53 మీటర్లు (80.5 టీఎంసీలు)గా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 22,290 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 4 గేట్లు తెరిచి సమానంగా 22,290 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.