CTR: చిత్తూరు నగరంలోని ఓ జనరల్ స్టోర్‌లో నిన్న రాత్రి దొంగతనం జరిగింది. నిమ్మన్నగారి వీధిలో ఈ దొంగతనం జరిగింది. రూ.2 లక్షల విలువ గల రెండు పెట్టెల సిగరెట్లను దొంగలు దోచుకెళ్లారు. షట్టర్ తాళాలు పగలగొట్టి దొంగలు జనరల్ స్టోర్ లోపలికి వెళ్లారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. దీనిపై చిత్తూరు టు టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.