GDWL: తెలంగాణని అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో రూపొందిస్తున్న ‘తెలంగాణ రైజింగ్- 2047’ డాక్యుమెంట్ రూపకల్పనలో ఉద్యోగులు పాల్గొనాలని గద్వాల కలెక్టర్ సంతోష్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షల మేరకు ఈ సర్వే అక్టోబర్ 10న ప్రారంభమైందని తెలిపారు. ఉద్యోగులు, పౌరులు పాల్గొని విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.