ATP: నేటి నుంచి సీకే నాయుడు అండర్-23 క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, కార్యదర్శి భీమలింగారెడ్డి మాట్లాడుతూ.. అనంతపురం క్రికెట్ గ్రౌండ్లో ఆంధ్ర, ఢిల్లీ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే క్రీడాకారులు నగరానికి చేరుకున్నారని, బీసీసీఐ నిబంధనల మేరకు ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.