HYD: ఓ ఇంట్లో దాచుకున్న ఎయిర్ గన్, తల్వార్‌ను సనత్ నగర్ పోలీసు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాలు.. భరత్ నగర్లో నివాసముంటున్న చంద్రకాంత్ కొందరితో గొడవపడగా గాయాలపాలయ్యాడు. ఇదిలా ఉంటే చంద్రకాంత్ ఇంట్లో గన్, తల్వార్ ఉన్నట్లు పోలీసులకు కొందరు సమాచారం ఇవ్వగా.. పోలీసులు సోదాలు నిర్వహించి ఎయిర్ గన్, తల్వార్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.