ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల భద్రత కోసం మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాల తరహాలోనే PG-13 రేటింగ్ మార్గదర్శకాల ఆధారంగా టీనేజ్ యూజర్లకు కంటెంట్‌పై రిస్ట్రిక్షన్స్ విధించనుంది. ఆటోమేటిక్‌గా 18 ఏళ్లలోపు యూజర్లను 13+ కేటగిరీ సెట్టింగ్‌లో ఉంచనున్నట్లు తెలిపింది. దీంతో డ్రగ్స్ వాడకం, అడల్ట్, హింసాత్మక కంటెంట్లను వారికి చూపించదు.