CTR: కుప్పం RTC డిపో ఏర్పాటుకు ప్రభుత్వం 15.37 ఎకరాలను కేటాయించింది. కుప్పం మున్సిపాలిటీ కమతమూరు రెవెన్యూ పరిధిలో 3.53 ఎకరాలు, గుట్టపల్లి రెవిన్యూ పరిధిలో 11.84 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆర్టీసీ డిపో కోసం కేటాయించిన భూమిని DPTO రాము, ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. అధునాతన వసతులతో నూతన ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేయనున్నారు.