KMM: ఎర్రుపాలెం మండలం మామునూరుపేట చెరువు అభివృద్ధికి డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో రూ.4.86 కోట్లు మంజూరయ్యాయి. మంగళవారం అభివృద్ధి పనులకు గాను D.E.N రామకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు చెరువుకు మార్కింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు.