BPT: మద్యం తాగిన వారిని సముద్రంలోకి అనుమతింమబోమని SP ఉమామహేశ్వర్ చెప్పారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సముద్రంలో ఈతలు వేయడం, మద్యం తాగి సముద్రంలోకి దిగటం నిషేధించామన్నారు. సముద్రంలో కేవలం స్నానాలు మాత్రమే ఆచరించాలన్నారు. ప్రజలు పోలీసు వారి నిబంధనలు పాటించాలని సూచించారు. చీరాలలో జరిగిన అవాంఛనీయ ఘటనల వంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.