KKD: జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ మంగళవారం రాత్రి కాకినాడ సీ పోర్టు పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విభాగాలను సందర్శించి భద్రతా చర్యలను సమీక్షించారు. పోర్టులో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. పోర్టు భద్రతను బలోపేతం చేయడానికి అలర్ట్ రెస్పాన్స్ సిస్టమ్‌ను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సిబ్బందికి సూచించారు.