GNTR: నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులోకి వచ్చిందని రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కురగంటి రఘురామయ్య తెనాలిలో తెలియజేశారు. షాపు వద్దకు విద్యుత్ శాఖ సిబ్బంది వస్తే మీటర్ నంబర్, వివరాలు చెప్పవలసి ఉంటుందన్నారు. విద్యుత్ 200 యూనిట్లు మించకుండా ఉంటే ఈ పథకం అమలులోకి వస్తుందని చెప్పారు.