ASF: తెలంగాణ రాష్ట్ర DGP గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన బి.శివధర్ రెడ్డిని మంగళవారం సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం, సిర్పూర్ నియోజకవర్గంలో శాంతి,భద్రతల గురించి చర్చించారు.