మావోయిస్టు పార్టీ చరిత్రలో సంచలనం చోటుచేసుకుంది. సీపీఐ (మావోయిస్టు) పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, అలియాస్ సోను ఇవాళ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆయుధాలను వదిలిపెట్టినట్లుగా సమాచారం. ఆయనతోపాటు మరో 60 మావోయిస్టు పార్టీ సభ్యులు కూడా అస్త్ర సన్యాసం చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన నిర్ణయానికి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని కేడర్ మద్దతు తెలిపింది.