కృష్ణా: జల్ జీవన్ మిషన్ కింద కృష్ణానది నుంచి ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇంటింటికి సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక DPRను తయారు చేయాలని ఎంపీ బాలశౌరి అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు.