J&K కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. మచ్చిల్ సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటుకు ప్రయత్నించడంతో వారిపై కాల్పులు జరిపారు. ఎల్ఓసీ సమీపంలో అనుమానాస్పద కదలికలను గుర్తించి ఆపరేషన్ను ప్రారంభించారు. భారీ కాల్పుల మధ్య ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని అనుమానంతో కూంబింగ్ చేస్తున్నారు.