VKB: రంగాపురం స్టేజ్ నుంచి పూడూర్ మండలం నిజాంపేట్ మేడిపల్లి, లాల్ పహాడ్ రోడ్డు వరకు రోడ్డు గుంతలమయమైంది. రోడ్డు రెండు వైపులా గడ్డి ఏపుగా పెరిగింది. ఈ రోడ్డుపై రోజూ వందలాది వాహనాలు నడుస్తున్నాయి. దీంతో రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు చాలా ప్రమాదకరంగా మారింది. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.