ADB: అక్టోబర్ 21 ఫ్లాగ్ డే(అమరవీరుల దినోత్సవం) సందర్భంగా నిర్వహించే పోటీలకు యువతను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం తెలిపారు. పోలీసులు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ తీసిన ఫోటోలు, వీడియోలను ఈనెల 23 తేదీలోగా జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేయాలన్నారు. ఎంపికైన వారికి బహుమతులను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.