VZM: మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి వారి నివాసంలో మంగళవారం నియోజకవర్గ ముఖ్య నాయకులతో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం, ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటుపరం చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు కమిటీలు పూర్తి చేయడం, బూత్ కమిటీలు వేయడం వంటి పలు సూచనలు చేశారు.