AP: విశాఖ గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా మారనుందని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్ పేర్కొన్నారు. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్ సీ-కేబుల్ విధానం ద్వారా అనుసంధానం, అమెరికా వెలుపల పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి అన్నారు. జెమిని ఏఐ, గూగుల్ అందించే ఇతర సేవలూ ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయన్నారు. ప్రపంచస్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం ఉందన్నారు.