MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం పాలమూరు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ రానున్నారన్నారు. ఈ వేడుకల్లో 12 పీహెచ్డీలు ఇవ్వనున్నామన్నారు.