NLG: రైతులు ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండలం ఐటిపాముల గ్రామంలో నిర్వహించిన వేరుశనగ విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, రైతులకు విత్తనాలు పంపిణీ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఆయన అన్నారు.