MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని చిలువేరి రాఘవి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 13న పటాన్ చెరువులో నిర్వహించిన ఎస్జీఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా అండర్- 17 కబడ్డీ పోటీలలో ప్రతిభ కనబరిచిన రాఘవి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ కిరణ్ తెలిపారు.