SGR: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగుస్తుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులు https://bse.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ. 1000 చొప్పున నాలుగు సంవత్సరాలు ఉపకార వేతనం అందిస్తారని పేర్కొన్నారు.