GDWL: వడ్డేపల్లి మండలాల విద్యార్థులు చదువు కోసం ప్రభుత్వ కళాశాలలకు వస్తున్నా, సరైన బస్సు సౌకర్యం లేక సమయానికి కళాశాలకు చేరుకోలేక, సాయంత్రం వేళల్లో ఇళ్లకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతునని ఏబీవీపీ మండల అధ్యక్షుడు వెంకటేష్ పేర్కొన్నారు. మంగళవారం అయిజలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.