MDK: చిలప్చెడ్లో ఏవో రాజశేఖర్ మంగళవారం వరి పొలాలను పరిశీలించి, సుడిదోమ, కంకి నల్లి, మెడ విరుపు తెగుళ్ల ఉద్ధృతిని గుర్తించారు. సుడిదోమ నివారణకు పొలంలో నీరు తగ్గించడంతోపాటు, తీవ్రత ఉంటే ట్రైఫ్లూమెజోపైరం పిచికారీ చేయాలని సూచించారు. అలాగే కంకినల్లికి స్పైరో మెసిఫేన్, మెడవిరుపుకు ట్రైసైక్లోజోల్ వంటి మందులను వాడాలని రైతులకు దిశానిర్దేశం చేశారు.