మేడ్చల్: సైనిక్ పూరిలోని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నివాసంలో డా.ఎ.ఎస్.రావు నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ నూతన కార్యవర్గ సభ్యులు ఆయనను కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు. కాలనీ సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.