SKLM: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలంతా ఐక్యమై తిప్పికొట్టాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల మహా ఉద్యమం, రచ్చబండ కార్యక్రమంలో భాగంగా లావేరు మండలం తామాడ గ్రామంలో మంగళవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.