ASR: హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాడేరు డీఎస్పీ షహబాజ్ అహ్మద్ గిరిజనులకు సూచించారు. మంగళవారం లోతేరులో సీఐ ఎల్.హిమగిరి, ఎస్సై గోపాలరావుతో కలిసి ప్రజలతో సమావేశమయ్యారు. మంత్రి సంధ్యారాణి ఆదేశాల మేరకు గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం నిలిపివేశారన్నారు. గిరిజనులకు ఇబ్బందులు కలిగించటం జరగదన్నారు.