SKLM: పలాస మున్సిపాలిటీ 7వ వార్డ్ చిన్న బడం గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి పట్టణ అధ్యక్షుడు బి.నాగరాజు మంగళవారం కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే శిరీష నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.